పుట:బేతాళపంచవింశతి.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రంబునకు వచ్చి యక్కొలనితీరంబునందుఁ గ్రీడార్థంబు డాసి శత
సహస్రావృతయై చంద్రరేఖయుంబోలె నయనానందం బొలయ నొప్పుచున్న
యక్కన్యం జూచి యుల్లసితమానసుండైన నరేంద్రనందనుం డచ్చోటుం గద
లక యుండె నంత.

31


క.

ఆ లీలావతి కాంచెను
బాలార్కప్రతిమానతేజుఁ బ్రద్యుమ్ననిభుం
మాలాలంకృతకంధరుఁ
బోలఁగఁ దనదిక్కుఁ జూచు భూపాలసుతున్.

32


క.

బాలానిలమున మెల్లన
తూలెడు మృదులతికవోలెఁ దోయజముఖినిన్
లీలావతిఁ బలుమారును
లోలామతిఁ జూచెఁ దంతలోలేక్షణుఁడై.

33


వ.

తదనంతరంబ.

34


సీ.

రాజపుత్త్రుఁడు చూడ రమణీయతత్సర
                సారవృతంబైన నీలోత్పలంబు
కర్ణంబులం దిడి క్రమ్మర నద్దాని
                నమరంగ దంతరత్నముల మోపి
ఖండించి పాదయుగ్మముపైని సవిలాస
                ముగ వైచి లీలతో మగుడఁ బుచ్చి
ఘనకుచంబులమీఁదఁ గదియించి కుప్పించి