పుట:బేతాళపంచవింశతి.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తలపులు సూచించి తడయ కపుడ
అచటువాసి చనియె నానందమూర్తితో
వనిత లలితవదన వనరుహమున
విభ్రమితకటాక్షవిక్షేపము రాజ
తనయుచూడ్కులకు ముదంబు వొదువ.

35


క.

తనమందిరంబునకుఁ జని
మనుజేశ్వరసుతుని నెపుడు మదిఁ దలఁపుచు నో
ర్వనికామతాపమున గ
గన డసైను దూర్పుచంద్రకళయుం బోలెన్.

36


వ.

అట వజ్రమకుటుండును నిజనగరంబునకుం బోయి యనన్యకార్యుం
డై యయ్యింతినిం దలంపుచుఁ బ్రతిదినప్రవర్ధమానమనోభవానలతాడ్య
మానమానసుం డగుచు బాలప్రవాళశయ్యాస్థుం డయి యున్న నెఱిం
గి మంత్రిసుతుండైన బుద్ధిశరీరుండు వచ్చి దేవా! ధైర్యసాగరుండ వైన
నీ ధైర్యంబున కిది యేమి యపాయంబు వుట్టెనని యి ట్లనియె.

37


క.

ఆ చెలువ యెచటిదో యని
యీచింతానలముఁ బొంద నేటికి నీకున్
సూచించె నపుడు సర్వము
నాచే నెఱుఁగంగబడియె నాక్రమమెల్లన్.

38


వ.

ఆ యింతి కర్ణంబుల నుత్పలంబు బెట్టికొనుటం జేసి కర్ణోత్పలుండను
రాజు కళింగదేశాధీశ్వరుం డనం బ్రసిద్ధుండై యుండు. ఆ పుష్పంబు