పుట:బేతాళపంచవింశతి.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దంతంబుల ఖండించుటం జేసి రాజునకు సచివుండైన దంతఘాతకు
ని కూఁతుర ననుటయు, దానిఁ బద్మంబులమీఁదఁ బెట్టుకొనుట తనపేరు
పద్మావతి యనుటయు, ఆయుత్పలంబు తనహృదయంబున నదిమికొ
నుట నీవు తనహృదయేశ్వరుండవని యెఱింగించుటయు. ఇందు సందే
హంబు లేదు. మృగయాఛద్మంబునఁ గ్రమ్మరం బోవవలయు ననిన నా
రాజకుమారుం డపుడు యతనిం దోడ్కొని.

39


గీ.

రాగియై నిరంతరంబును బ్రియజనా
యత్తచిత్తుఁ డగుచు నతిరయమునఁ
గదలెఁ దురగ మెక్కి కామాంధులకు నలం
ఘ్యంబు గలదె యెంతగహన మైన.

40


వ.

ఇట్టిరువురునుం గళింగనగరంబునకుం బోయి యందొక్కవృద్ధాంగ
నఁ బొందుఁ జేసికొని దానియింట విడిది చేసి యేకాంతంబున నక్కాంత
తోడ దంతఘాతకు నెఱుంగుదువే యని యడిగిన నెఱుంగుదు నతం
డ రాజునకు సచివుండు, నతనికూఁతురు పద్మావతి యనఁ గలదని చెప్పి
వెండియు ని ట్లనియె.

41


క.

వారలకు గర్భదాసిని
వారాశ్రయమందు నెపుడు వర్తింతు సదా
చారంబు కులము నెఱుఁగుదు
మీ రెవ్వ రిదేమి కార్య మెఱిఁగింపుఁ డొగిన్.

42


వ.

అనిన దానివలన సంతోషించి యాప్తీకరించి తమవచ్చినకార్యంబు