పుట:బేతాళపంచవింశతి.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సర్వంబును నెఱింగించి దానిన దూతికం జేసి పద్మావతియున్నచోటికిం
బంపిన నది వోయి కొలనికడకు వచ్చిన రాజకుమారుండు వచ్చియున్న
వాఁ డని పద్మావతికిం జెప్పిన దానిం జింతింపనియదియునుంబోలె మిథ్యా
కోపంబు దెచ్చుకొని దాని కి ట్లనియె.

43


క.

నా కిట్టి మాట చెప్పఁగ
నీకుఁ దగునె ముదుకవరుస నీతియె యిది హా
హా కడుదుశ్శలవు నను
పోకలఁ బుచ్చంగఁ దగునె పురుషులని మదిన్.

44


వ.

అని కర్పూరరజోమిళితంబైన హస్తపల్లవంబులు రెండు గండస్థలంబు
ల వ్రేసిన దుఃఖింపుచు గృహంబునకు వచ్చి తనచెప్పినకార్యంబున క
య్యింతి కోపించి తన్ను వ్రేసిన చందం బిరువురకుం జెప్పిన విని రాజ
పుత్త్రుండు దుఃఖితుండై నిశ్వాసముఖుం డగుచు మంత్రిపుత్త్రున కి
ట్లనియె.

45


ఉ.

అక్కట మందభాగ్యకృతయత్నము లేల ఫలించు నెచ్చటన్
నిక్కము దైవతోపహతి నీకు మరల్పఁగ రాద యింక నీ
విక్కడ వాసి న న్విడిచి యేగుము భూమికి దీనియందు నా
మక్కువ చిక్కియున్నయది మాన్పఁగఁ బోలదు దుశ్చికిత్సలన్.

46


వ.

ఎటకేనియుం బోయెద ననిన నమ్ముసలిది వినకుండ మంత్రిపుత్త్రుం
డి ట్లనియె.

47


క.

ఆర్య హితమతివి కడు నీ
ధైర్యము దిగవిడచి యింత తగునే యడలన్