పుట:బేతాళపంచవింశతి.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కార్యముఖ మెఱుఁగవలదే
కార్యం బిది నీకు సిద్ధికల్పం బయ్యెన్.

48


వ.

అది యట్లుండనిమ్ము. యిమ్ముసలిగండస్థలంబులయందుఁ గర్పూర
రజస్సహితంబైన యయ్యింతి హస్తాంగుళంబులు పది యునికిం జేసి
శుక్లపక్షం బింక పదిదినంబులు గల విటమీఁదఁ గృష్ణపక్షంబులో స
మాగమంబు గలుగునని చెప్పుటయు నన విని యతనివచనంబుల
కుఁ బ్రహృష్టహృదయుండై యాపదిదినంబులు యెట్టకేనియుం బుచ్చి
మరునాఁ డమ్ముసలిం బంచినఁ బద్మావతియు దానిపలుకు లాలకిం
పక కుంకుమాంకితంబులైన హస్తంబుల నమ్ముసలి యురంబునం
దుఁ ద్రిపుండ్రంబుగా వ్రేసినఁ దడుకితయై గృహంబునకు వచ్చి య
క్కన్య కినిసి తన్ను వ్రేసినచందంబుఁ జెప్పిన మంత్రిపుత్త్రుఁడు శోకో
త్కంఠుండైన రాజకుమారునకు నేకాంతంబున ని ట్లనియె.

49


క.

తా నిపుడు రజస్వల నని
దీనియురంబునను వ్రేసి తెలుపుట కాదే
మానైన మూఁడురేఖలు
మానిని నిలుపంగఁ జెప్పె మానిని నీకున్.

50


గీ.

ఆ యమాత్యతనయుఁ డ ట్లెఱింగించిన
నతిముదంబు బొంది యధిపసుతుఁడు
నాఁడు మొదలుగాఁగ మూఁడుదినంబులు
కడఁగి యేండ్లయట్లు గడపె మఱియు.

51