పుట:బేతాళపంచవింశతి.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

నాలవదినంబున నెప్పటియట్ల దానిం బుచ్చినం బోయి యక్కన్య దన
మాట లాదరించి చేసిన సత్కారంబు చెప్పి రాజగజంబు మదించి గవనివెలుప
ల నున్నయది యందుం బోరాదు యిందుఁ బొమ్మని యొక్కరజ్జువుం గట్టి
మేడ దించి పుత్తెంచెనని చెప్పిన విని మంత్రిపుత్త్రుండు సంతుష్టుండై రాజ
పుత్త్రుమొగంబుఁ జూచి ని న్నారజ్జు వెక్కి రమ్మన్నయది నీ వచ్చోటికిం బొ
మ్మనిన నతని యనుమతంబున.

52


క.

ఆ రజ్జువు నెక్కి ప్రియా
గారంబునకుం జనియెఁ జేటికలు దిగిచికొనం
గా రాత్రి వివిధప్రే
మారూఢమనస్కుఁ డగుచు నతిరభసమునన్.

53


వ.

ఇ ట్లరిగి సుప్తజనపరివృతంబైన యంతఃపురంబు సొచ్చి.

54


క.

సుందరనవరత్నప్రభ
నిందుశిలాకుట్టిమమున నింపగు లీలా
మందిరమున మణిశయనము
నం దున్నలతాంగిఁ గాంచె నక్కన్యకయున్.

55


వ.

శయ్యాతలంబు వాసి లజ్జావనతవదనయుఁ గంపమానపయోధర
విన్వస్తహస్తయుఁ బరిస్ఫురితవిభ్రమవిలాసితయు నై తొలంగి నిలి
చినం జేర నరిగి యా రా జి ట్లనియె.

56


క.

నామానసదుగ్ధాబ్ధికి
సోమప్రభ లగుచు నీదుచూడ్కులు వొలయం