పుట:బేతాళపంచవింశతి.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గా మొగ మెత్తి సలలితవ
చోమాధుర్యంబు చెవులఁ జొనుపవె దయతోన్.

57


గీ.

అనుచు రత్నపాత్రయందున్న సురభిగం
ధంబు దానిమేని కనునయముగఁ
దనియనిచ్చి వేడ్కఁ దాను నాస్వాదించి
మదనమధ...............మానసమున.

58


గీ.

కౌఁగిలింప నతని కరమహాగ్రహణ
మీలితాంతరంగయై లతాంగి
మధుమదానురక్తమధుకరం బొలుచుచుం
బనవిధిప్రయోగమునను సొగసి.

59


వ.

అంత నా కృత్రిమవిలాసంబును. ఆ శిక్షితకళాక్రమంబును. ఆ విభాం
గాంగానుభవంబును నైనసంభోగంబునందు వృద్ధయై రాచకొమారుం
డు చిత్తవృత్తాపహారి యగుచునుండె. నవ్విధంబునఁ బెక్కురాత్రులు
నిరువుర కతిగూఢం బయినసమాగమం బయ్యె నంత నొక్కనాఁడు
రాజపుత్త్రుండు వెలినున్న మంత్రిపుత్త్రుం దలంచి.

60


గీ.

తల్లిదండ్రుల సకలబాంధవులనెల్లఁ
దొరఁగి పరదేశమునకు నాతోడ వచ్చి
యొక్కరుఁడు మంత్రిసుతుఁడు యెట్లున్నవాఁడొ
యనుచుఁ జించించి మిన్నక యధిపుఁ డున్న.

61


వ.

అన్యమనస్కుం డగుట యెఱింగి యిది యేమి చింతిచెద వని యడిగిన