పుట:బేతాళపంచవింశతి.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యక్కథంతయుఁ జెప్పించుకొని యి ట్లనియె.

62


క.

నీకు మనఃప్రియుఁడై
వీఁకను నా యింగితంబు వివిరించి తగం
జేకొని చెప్పఁగ నేర్చువి
వేకము గలసఖుని కింతవిముఖుఁడ వగుదే.

63


వ.

అతండు నాకు మాన్యుం డతని కిష్టంబైన శిష్టభోజనంబు వెట్టుమ
ని పంచినం గొనివచ్చి వివిధంబులైన భక్ష్యమాల్యానుతాంబూలాది
పదార్థంబులు మంత్రిపుత్త్రున కిచ్చి తమయిద్దఱి సల్లాపంబులు నె
ఱింగించిన నతండు భక్ష్యంబులు చూచి రాజపుత్త్రున కి ట్లనియె.

64


క.

ననుఁ దలచి నీవు పొగడం
జనునే యీ దయిత యెదుర జనవల్లభనం
దన యింత జడుఁడ వగుదువె
వినవే భక్ష్యంబు లివియు విషదిగ్ధంబుల్.

65


వ.

రాజపత్ను లయినస్త్రీలు భర్తలకుం బ్రేమమూలంబులైనవారి కలిమి
సహింపరు. నీవు నమ్మవేనిం జూడుమని యాభక్ష్యంబు లొక్కశున
కంబునకుఁ బెట్టిన భక్షించి యది యప్పుడ ప్రాణంబులు విడిచినం
జూచి యారాజపుత్త్రుం డాయింతివలన నెంతయుఁ గోపించి నిలిచె
నట్టియవసరంబున నగరీశ్వరుం డయినకర్ణోత్పలుని ప్రియతన
యుండు కాలనియోగంబునం జేసి కాలాంతరంగుండైనఁ దత్కల
కలంబు విని మంత్రిపుత్త్రుండు రాజపుత్త్రున కి ట్లనియె.

66