పుట:బేతాళపంచవింశతి.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మతిఁ గినుకవలదు పద్మా
వతిదెస నీ రాత్రి వోయి వరమధుమదసం
యుతఁ జేసి యెఱుఁగకుండఁగ
నతిరయమున నపహరించు మాభూషణముల్.

67


వ.

ఆ తొడవులు వుచ్చుకొని దానితొడ త్రిశూలాంకంబు లాంఛనంబు
గోర వ్రాసి వచ్చునది యనిన నట్ల సేయుదునని పోయి మధుపాన
మత్తయైన దానతొడ త్రిశూలాకారం బొనర్చి యాతొడవు లన్నియుఁ
గొని వచ్చినం జూచి యిద్దఱు సిద్ధవేషంబులు ధరియించి యందొక్క
హారంబు విపణివీథికిం గొనిపోయి యమ్ము మని రాజపుత్త్రుని చేతి
కిచ్చి.

68


క.

ఈ హారం బమ్మెద నని
బేహారుల కెల్లఁ జూపుఁ బ్రియమున విలువ క
ద్గోహలులై వచ్చుటయు
న్నీహితమతి దెగిబడక నీకు మెవ్వరికైనన్.

69


గీ.

హార మెవ్వరి దని యడిగిరేనియు నట
భిక్షుఁ డమ్మెడునని పేరు చెప్పి
యతని దెత్తు గాక యని ప్రేతవనమున
కరిగె మంత్రిసుతుఁడు నంతఁ బతియు.

70


వ.

ఒండురూపంబు చేకొని మౌక్తికవలయంబు గొనిపోయి విపణివీథి
జూపునెడఁ గొందఱు రాజపురుషు లిది యెవ్వరిహారం బని యడిగి
న వారిం దోడ్కొని వచ్చి విప్రవేషధరుండైన మంత్రిపుత్త్రుం జూపి వీరు