పుట:బేతాళపంచవింశతి.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మా గురువులు వీరి యర్థం బిది యని చెప్పిన వార లాభిక్షున
కి ట్లనిరి.

71


క.

మీ రెవ రీమణిహారము
చేరిన తెఱఁ గేమి మాకుఁ జెప్పరె యనినన్
మీరాజు వచ్చి యడిగెడు
మీ రడుగఁగవలదు పొండు మీపతికడకున్.

72


గీ.

అనిన వారు పోయి యట్ల చెప్పుటయుఁ గ
ర్ణోత్పలుండు భిక్షునొద్ద కరిగి
భక్తియుక్తుఁ డగుచుఁ బ్రణమిల్ల నతని దీ
వించి యిట్టు లనియె వికృతవేషి.

73


క.

భూనాథ నీపురంబున
మానవు లొరు లెఱుఁగకుండ మరుపడి యొకచో
దానవి యున్నది యెఱుంగవ
కో నల దంతఘాతకుని కూఁ తనుచున్.

74


వ.

అది రాత్రి యెల్లను దిగంబరియై వర్తింపుచుండు నది మొన్న నీపుత్త్రున
కపాయంబు చేసినం గోపించి శూలంబున వ్రేసి దానిహారంబు వుచ్చు
కొంటి నది స్త్రీ యగుటం జేసి వధార్హురాలు గాదు. నీపురంబు వెడలం
ద్రోపించు మనినఁ గర్ణోత్పలుండు కోపానలకళంకితుండై పద్మావతిం
బట్టి తెప్పించి యూరువందున్న త్రిశూలాంకంబు పరిచారులచేతం
జూపించి భిక్షుండు చెప్పిన శూలాంకంబని తలంచి యప్పు డత