పుట:బేతాళపంచవింశతి.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ని నగరంబు వెడలం దోపించినంత భ్రాంతమానసయై పురంబు వె
డలిపోయెఁ గర్ణోత్పలుండును గృతకభిక్షుని వీడ్కొని పోయె నంత.

75


క.

 ఆ పడఁతియుఁ గడువంబడి
వాపోవుచు వెడలుచుండ వారలు నిజమౌ
రూపములం దాల్చిరి
భూపతితనయుండు మంత్రిపుత్త్రుం డంతన్.

76


వ.

ఇ ట్లరుదెంచి రోదనాకలితయైన దాని ననునయించి దోడ్కొని
వారాణసీపురంబునకు వచ్చి వజ్రమకుటుం డయ్యింతియం
దనురక్తుండై సుఖం బనుభవించుచుండె. నిట దంతఘాత
కుండుఁ దనకూఁతురు తనుబాసిన తెఱంగునకు తలంచు
చుఁ బ్రాణంబులు విడిచె నతనిభార్యయుం దదనుగమనం
బు చేసె నని కథ చెప్పి భేతాళుండు వెండియు ని ట్లనియె.

77


క.

తనకూఁతురు తను బాసిన
ననిశంబును నడలి యడలి యాదుఃఖభరం
బున దంతఘాతకుఁడు చ
చ్చినపాపం బెవరిఁ దాఁకుఁ జెప్పఁగవలయున్.

78


గీ.

ఎఱిఁగి చెప్పకున్న నీయాయుధంబునఁ
దల వగుల్చు జువ్వె ధర్మశాస్త్ర