పుట:బేతాళపంచవింశతి.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విదుఁడ వౌట నీవివేకతఁ దప్పక
చెప్పి చేయు నాదు చిత్త మలర.

79


వ.

అనిన భేతాళున కమ్మానవేశ్వరుం డిద్ధవిచారుండై యి ట్లనియె.

80


సీ.

రాజపుత్త్రునకు రమణికి నెగ్గులే
                దంగజరాగాత్ము లగుటఁ జేసి
పతిభక్తినిరతుఁడై పటుబుద్ధి గావున
                మంత్రిపుత్త్రునకుఁ గల్మషము లేదు
కర్ణోత్పలుఁడు వివేకము దప్పి యె ద్దీనె
                ననిన గొందిని గట్టుమన్నయట్లు
యసుర యని మంత్రి నరయక వెడలంగ
                నడిచె సచివుకూఁతు నక్షణంబ
దానఁ జేసి దానితండ్రి మృతుం డయ్యె
గాన యతఁడు పాపకర్ముఁ డనియె.

81


క.

శోధించి సేయవలయు ధ
రాధిపతులు కార్యములును యాగములు మణుల్
శోధింపక చేసిన దు
ర్యోధనునకు బాడి దగిలి యుండిన భంగిన్.

82

2వ కథ

క.

అని మౌన మెడలి పల్కిన
మనుజేశ్వరు మూపు డిగ్గి మసలక వేగం