పుట:బేతాళపంచవింశతి.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బున భేతాళుఁడు వృక్షం
బునకుం జని ముందటిభంగిన్.

83


గీ.

వానివెనుకఁ బోయి వదలక యావృక్ష
మెక్కి పట్టుకొని యహీనబలుఁడు
గురుభుజంబునందుఁ గొనివచ్చునెడ వాఁడు
నవనిపతికి నిట్టు లనియె మఱియు.

84


సీ.

ధరణీశ వినుము దత్తావధానుండవై
                చెప్పెద నొకకథ చిత్త మలరఁ
గాళిందితటమునఁ గలదు బ్రహ్మస్థలం
                బనఁ గల యగ్రహారంబునందు
ననఘుఁ డగ్నిస్వామి యనుబ్రాహ్మణుఁడు శృతా
                ధ్యయనసంపన్నుఁ డుత్తముఁడు గలఁడు
తత్పుత్త్రి కలదు మందాకినీకన్యక
                మందారమాలికామధురగాత్రి
మహితరూప కులాచారమహిమయందుఁ
బేరు గలయది గావునఁ బృథివియందుఁ
దగినవారలు బ్రాహ్మణోత్తములు వత్తు
రర్థిఁ గన్యకఁ గొడుకుల కడుగవేఁడి.

85


వ.

అంత నొక్కనాఁడు.

86


క.

మూవురు విప్రకుమారులు