పుట:బేతాళపంచవింశతి.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భావజతనుగుణవయోవిభవరూపసమా
నావయవు లొక్కచందము
భావింపఁగరాదు విడుప రనంగ వచ్చున్.

87


క.

ఆ కన్యను నర్థింపఁగ
నాకాములు మువ్వురును మహౌత్సుక్యముతో
నాకన్య తండ్రిపాలికి
వీఁకను జని యడుగుటయును విస్మితుఁ డగుచున్.

88


వ.

దర్పకప్రతిరూపంబులుంబోని యమ్మువ్వురం జూచి విచారింపుచుండె
నంత వార లాయగ్నిస్వామి కి ట్లనిరి.

89


గీ.

అనఘ నీవు మువురయం దొక్కనికిఁ గూఁతు
నిచ్చెదేని యున్న యిద్దఱమును
బ్రాణముల్ త్యజించఁ బ్రతిన పూనితి మనఁ
బాల నీగ నోడె బ్రాహ్మణుండు.

90


వ.

వారును నయనానందకారియైన యక్కన్య నిచ్చలుం జూచుచుఁ బాసి
పోవంజాలక యప్పురంబునందుఁ బ్రకృతాశ్రయులై వర్తింపుచుండి రం
త సద్గుణసముదాయపరాఙ్ముఖుండైన విధిచేతం జేసి యక్కన్య కాల
ప్రాప్తంబైన నమ్మువ్వురు శోకాకులితులై రోదనంబు సేయుచున్న నం దొ
క్కరుండు దుఃఖాతిశయంబున భస్మధారియై దేశాంతరంబున కరిగె.
మఱియు నొక్కరుండు నక్కన్యకయస్థులుం గొని వారాణసికిం బోయె.
మరియు నొక్కరుండు దానిదహించినభస్మంబు నాశ్రయించి స్మశానం