పుట:బేతాళపంచవింశతి.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బిల్లుగా నుండె.

91


గీ.

యట్టు మతిమంతులైన ధరాసురోత్త
ములకుఁ బొలఁతికై యిట్టి దుర్బుద్ధి వుట్టె
రాగు లయ్యను ఇష్టవియోగవంతు
లైనవారలు సేయనియవియుఁ గలవె.

92


వ.

జటాభస్మధారుండై మున్ను వోయినవాఁడు దేశభ్రమణంబు సేయు
చు యొక్కయగ్రహారమునందు రుద్రశర్మ యనువిప్రుండు గ్రాసం
బిచ్చిన భోజనంబు సేయునెడ గృహస్తునితోడం గోపించి తద్గృపాణి
యేడ్చుచున్న తనకొడుకు నెత్తి యగ్నియందు వైచిన తత్క్షణంబ
యబ్బాలకుండు మృతుండయ్యె నంత నాభిక్షుండు గోపించి భోజ
నం బుడిగి.

93


గీ.

మాలకోమలింటి కేల వచ్చితి నన
నలర వేగ నాగృహస్థుఁ డపుడు
మంత్రశాస్త్రవాదుండు మంత్రకల్పము చూచి
మహితమైన సిద్ధమంత్రమునను.

94


వ.

తనపుత్త్రుని సజీవితునిం జేసిన జటాధరుం డతివిస్మితుండై యం
దు నిల్చి ప్రియాజీవితార్థుండై యారాత్రి యావిప్రు మంత్రకల్పం బ
పహరించికొని మగిడి వచ్చునెడఁ దీర్థాగతుండైన వానిం గని యిరు
వురుం గూడి మందారవతిని దహించిన భస్మంబుకడకుఁ జని యచ్చోట
నున్నయతనినిం గాంచి రంత మంత్రసిద్ధుండైన జటాధరుం డక్కన్యక