పుట:బేతాళపంచవింశతి.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

భూతములకైన యప్పుడు
భీతి జనింపంగ నెగసి బిట్టుగ నగుచున్
భూతలపతికి నదృశ్యుం
డై తీఁగెలనడుమ దూరె నతిరభసమునన్.

23


వ.

ఎప్పటియట్ల వృక్షంబుమీదికిం బోయి పాశంబుల మెడం దగిలించి
కొనియున్నం జూచి భేతాళుమాయఁగా నెఱింగి క్రమ్మరి వృక్షంబు
నెక్కి భేతాళరూపధరుండైన వాని లతాపాశంబులం గట్టుకొని దిగి
వచ్చి భుజశిఖరంబులపైఁ బెట్టుకొని వచ్చుచున్నయెడ నన్నరే
శ్వరునకు భేతాళుం డి ట్లనియె.

24


క.

నీ కొక కథఁ జెప్పెద సు
శ్లోక వినోదముగ వినంగఁ జోద్యం బదియున్
శ్రీకర మెల్లను బొందును
నాకర్ణింపుము సుబుద్ధి నని యి ట్లనియెన్.

25

1వ కథ

క.

వారాణసి యనుపేరను
గౌరీకృతమైన పురము గలదు హిమాద్రీ
స్ఫారస్ఫాటికవిమలా
గారంబై ధరణియందుఁ గడుఁ బెడఁ గడరన్.

26


క.

అందులఁ బ్రతాపమకుటుఁ డ
నందె లొలిం (దొర్లి?) గలండు రాజు నరవినుతుఁడు ద