పుట:బేతాళపంచవింశతి.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీరామాధిపమూర్తి సర్వజనసంసేవ్య ప్రభావోదయా.

17


వ.

అని యన్నరేంద్రుని గుణకీర్తనంబుఁ జేసి యి ట్లనియె.

18


క.

ఇచటికొక యైదు మైలను
ప్రచురమహాశాఖి శింశుపావృక్షము భూ
తచయాశ్రయ మున్నది నీ
వచటికిఁ బోవలయు దక్షిణాభిముఖుఁడవై.

19


వ.

ఆవృక్షంబునం దొక్కనరుఁడు వ్రేలుచున్నవాఁడు వానిఁ దేవలయుననిన
నట్ల సేయుదు నని ప్రవృద్ధంబైన తమకంబునఁ బ్రకాశార్థం బొకకొరవి
పట్టుకొని నీచుండునుంబోలె కుంఠితుండై దరిద్రుండునుంబోలె విచ్ఛా
యంబై కుకవికావ్యంబునుంబోలె నవిస్పష్టంబై పిశాచంబునుంబోలె
విషణ్ణంబైన యావృక్షంబునొద్దకుం బోయి.

20


గీ.

దానికొమ్మల నగ్రపాదముఁ దగిల్చి
దీర్ఘబాహులు రెండును దెసలఁ జరఁచి
యవుడు కరచి యధోముఖుఁడైన ఘోర
శవముఁ గనుఁగొని నృపతి నిశ్శంకుఁ డగుచు.

21


వ.

ఆ వృక్షంబు నెక్కి శవంబు కరంబులం దున్న పాశంబులు గోసి నేల
బడద్రోచిన హాహాకారంబు లెసంగ నాక్రోశింపుచు నాకరంబులు భగ్నం
బులయ్యెనని యేడ్చుచున్న నిక్కువంబుగా వగచి యన్నరేంద్రుండు
వృక్షంబు దిగివచ్చి కరుణాకలితచిత్తుండై వానిశరీరంబుఁ దోవలచున్న
యప్పుడ వికటాకారుండై.

22