పుట:బేతాళపంచవింశతి.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అనఘచరిత్ర మాదృశుల యాపద మాన్చి యభీష్టవస్తువుల్
దనరఁగ నిచ్చి శౌచమును ధర్ము సత్యముఁ గల్గి లోకుల
న్మనుపఁగఁ బుట్టియున్న ధృతిమంతుల నాశ్రితధర్మవృద్ధి స
జ్జనయుతులన్ నృపోత్తముల సత్యసమేతుల వేఁడు టొప్పదే.

11


సీ.

క్షితినాథ వినుమ యీకృష్ణచతుర్దశి
                నాఁటిరేయి స్మశానంబునందు
శక్తిమై నొకమంత్రసాధన మేఁ జేయఁ
                గడఁగినవాఁడ నక్కార్యమునకు
నాకుఁ దోడై వచ్చి నరవర రెండవ
                సాధకుండవు గాను సతతముగను
నాప్రదేశమున మహావటవృక్షంబు
                మొదట నే నుండెద మున్నె పోయి
నీవు రాత్రి రమ్ము నిర్మలఖడ్గంబు
కరము నొడిసివట్టి కడురయమున
నొక్కరుండవును సముజ్జ్వలాకృతితోడ
ననిన నియ్యకొనియె నవనివిభుఁడు.

12


వ.

అంత.

13


క.

ఆ కృష్ణచతుర్దశినా
డేకాంతమ భిక్షుఁ డచటి కేగుటయును ధా
త్రీకాంతుఁడు సాయంసం