పుట:బేతాళపంచవింశతి.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధ్యాకృత్యము లొనరదీర్చి యత్యుత్సుకుఁడై.

14


సీ.

యక్షకర్దమయుక్తమైన భస్మాంగంబు
                పొలుపొందఁగా నెఱపూతఁ బూసి
భూరిప్రకాశితపూతవిభూతిపౌం
                డ్రకముపై రోచనరచన బెరయ
విమలారుణప్రభావములైన యట్టి సం
                ధ్యారాగవస్త్రంబు లమరఁగట్టి
రక్షాకరంబులు రమణీయములు నైన
                పృథులనీలంబులపేర్లు వేసి
వీరరసము పొంగి దెలివచ్చె నాఁగస
మున్నతాంగకాంతి యుజ్జ్వలముగ
విక్రమాంబునిధి త్రివిక్రమసేనుఁ డొ
క్కరుఁడు పితృవనమ్ముకడకుఁ గదలె.

15


వ.

మఱియు నతఁడు మేరునగంబునుంబోలెఁ బ్రభూతసత్వనివా
సంబైఁ గోపవేషధారుండైనకృష్ణుండునుంబోలె మయూరపింఛో
ల్లసితశిరోవేష్టకుండై ప్రళయకాలునాలుకయుంబోలె నాభీలంబై
న కరవాలంబు కేలం బ్రజ్వరిల్ల నీరంధ్రంబైన యంధకారంబున
మణిమండలప్రభలు మార్గదర్శనంబులుగా వెడలి స్మశానక్రీడా
రతుండైన రుద్రుండునుంబోలఁ దత్ప్రదేశంబునకుం బోయె నది
యు ధూమాంధకారమేదురధ్వాంతంబును నతల