పుట:బేతాళపంచవింశతి.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యొక్కనాఁడు కాంతిశీలుండను శ్రమణభిక్షుండు సీతాగ్రహణార్థంబు
వచ్చినరావణుండునుంబోలె రాజసభకు వచ్చి యొక్కఫలంబు దర్శనం బిచ్చి
నం బుచ్చుకొని కోశాధికారిచేతి కిచ్చి మాయాభిక్షుతో వినోదింపుచుం బ్రొద్దు
పుచ్చుచుండ.

6


క.

అదిమొదలు గాఁగ నిచ్చలు
సదమలఫల మొకటిఁ దెచ్చి జగతీపతికిన్
ముద మొదవఁగఁ జన నిచ్చుచు
బదియేండ్లుం గొలిచె నధికభక్తియుతుండై.

7


వ.

ఆరా జతండు నిచ్చలు తెచ్చుఫలంబులు కోశాధికారిచేతి కిచ్చుచు యొక్కనాఁడు
పండు పుచ్చుకొని క్రీడావానరంబున కిచ్చిన నది దానిం గరచి పుచ్చిన నందొక్క
దివ్యరత్నంబు వెడలిన తత్ప్రభాజాలంబునం బేమి యాస్థానం బెల్లఁ బ్రజ్వరిల్లుచున్న
నాశ్చర్యం బంది భాండాగారంబునకుం జని యందున్నఫలరాశిగళితంబులైన దివ్య
రత్నంబులం జూచి మరునాఁ డెప్పటియట్ల సేవింపవచ్చినభిక్షునకు నా రా జిట్లనియె.

8


గీ.

 ధర నమూల్యములైన రత్నములు దెచ్చి
యిచ్చి యింతకు మిక్కిలి యేమి వేడం
దలఁచి కొలిచెదు నీదుయత్నంబు గడువి
చిత్రమై యున్న దిది యేమి చెప్పు మనుఁడు.

9


వ.

తనకార్యసిద్ధియందుఁ గృపాపరుండైన యా రాజునకు భిక్షుం డి ట్లనియె.

10