పుట:బేతాళపంచవింశతి.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

దారునకుఁ బువ్వులు గొని తా
వెరవారఁగఁ దెచ్చి కథలు వినియెడికొఱకై
కరమర్థి గోడమీఁదను
పరికింపఁగరాని పసిఁడిబల్లై యుండెన్.

3


వ.

ఇట్లు పుష్పదత్తుండు విస్మయపరంబైనవిధంబునఁ బార్వతి హరుఁడును
నెఱుంగకుండ కృత్రిమభావంబునం గథలు వినుచుండఁ బరమేశ్వరుండు
రుద్రాణికిం బ్రియంబు వుట్టునట్లుగా నిరువదేను కథలు చోద్యంబుగాఁ
జెప్పుటయు విని మనంబున నత్యాశ్చర్యం బంది మాయోపాయంబున
నిజనివాసమున కరిగి భార్యకుం దనయున్నతెరు గెఱుంగ వివరించి
చెప్పిన మరునాఁడు రేపటియవసరంబునకు నభిధామసౌరభంబులు
పంచు పారిజాతకుసుమదామంబులుం గొనివచ్చి యాదేవిపాదార
విందంబుల కెరఁగి పుష్పదంతునిభార్యయైన సైరంధ్రిభామ యవస్థ
రాయుమని కరంబులు మొగిడ్చి యిట్లనియె.

4


క.

విన నింపు వుట్టునట్లుగ
వినుపింపఁగ నేర్తుఁ గథలు వివరముతోడన్
వినుమనుచుఁ బుష్పలావిక
యనుపమమతితోడ గౌరి కన్నియుఁ జెప్పెన్.

5


వ.

దత్తావధానవై యొక్కకథ నాకర్ణింపుమని యిట్లని చెప్పె. తొల్లి ప్రతి
ష్ఠానపురంబునందు విక్రమసేనుండను బ్రఖ్యాతుండై యశస్తేజంబుల
చంద్రాదిత్యతుల్యుండైన రాజు గలఁ డతండు రాజ్యంబు సేయుచుండి