పుట:బేతాళపంచవింశతి.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అనిప కాతని జెలిక
త్తెను దెమ్మని పంచి గూఢతరకామసుఖం
బొనరింపుచుండె ననిశము
వనితల రాగంబు దుర్నివారోత్సుకులై.

139


వ.

ఇట్లుం దనయల్లుండు ధనదత్తుండు సంతోషించి యతిసత్కారగౌరవంబునం
బూజించె. నంత నతండు నా రాత్రి విమలమాల్యాంబరాభరణరాజితుండై
శయ్యాగృహంబునకు వచ్చి భార్యాసమేతుండై మధుపానం బొనరించి
సంభోగకుతూహలుండై యాలింగనంబు సేయు నవసరంబున.

140


సీ.

ఆ యింతి మొదల నన్యాసక్త కావున
                పతి భజించనివి బలువు చేసి
పైవల్ల్వతోఁ గూడ బాహుమూలంబున
                ఖండితంబుగ స్వస్తికములు చేసి
ఘనపయోధరములు కంపింప ఘటితంబు
                నూరుప్రదేశంబు లొనరఁ జేసి
చలి దాఁకినదిబోలెఁ జలితాంగియై కర
                స్పర్శ సహింపక పలుకకుండె
దానియాకృతిఁ దలంపును దా నెఱుఁగక
మూఢుఁ డనునయించి మ్రొక్కఁదొడఁగె
మున్ను రాగియై మోశఁ జెప్పంగ నేల