పుట:బేతాళపంచవింశతి.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యెట్టివారికైన నాస్థ వుట్టు.

141


క.

జరభి తనతండ్రియాజ్ఞకు
వెరచి మగనివద్దఁ జిచ్చు వేసినది పైఁ
జెరుపఁగ నున్నతెఱుగున
నెఱి చెడి కాంత తడవుండె నిశ్చేష్టితయై.

142


వ.

అంత నతండు మధుపానవశుండై కాష్ఠంబునుంబోలెఁ బడియున్న
నెఱింగి సర్వాభరణభూషితయై యుద్యానవనంబున కరిగి యందు
నంతకుమున్న సర్పదష్టుండై శరీరంబు విడచి యున్న యతని
డగ్గఱి చూచి.

143


క.

పిడు గడఁచినట్లు పతిపైఁ
బడి హా ప్రియ హా మదేకబాంధవ నన్నున్
విడిచితె నాకై జీవము
విడచితె సంసారసుఖము విడిచితె యకటా.

144


గీ.

అనుచు మీఁద వ్రాలి యందలయెతి యం
దంద కుచతటముల నదుముకొనుచు
నచటఁ దడయుటయును నలిగితె నాతోడఁ
బలుకవేల యనుచుఁ బడఁతి మఱియు.

145


క.

తరుణాక్షాశ్రులు మునుఁకుచు
శిరమున పుష్పములు చక్కఁ జివురుచుఁ దాంబూ
లరుచిరమగు దానధరము