పుట:బేతాళపంచవింశతి.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

రాజపుత్త్రునకుఁ గ్రీడాశుకం బిట్లని చెప్పెఁ దొల్లి హవతి యను
పురంబున ధర్ముండను రాజు గలఁడు. ఆ రాజ్యంబున ధనవంతుం డను
వైశ్యుండు గలం డతనికూఁతురు ధవళవతి యనుకన్య గల దది రూప
లావణ్యనిలయంబై తారుణ్యతరమంజరియై యున్న దానిం దామ్రర్తు
పురవాసుండైన సముద్రదత్తుం డనువైశ్యకుమారున కిచ్చి యపుత్ర
కుండు గావున నతనిం దనయొద్దఁ బెట్టుకొని యుండ నతండు తన
వారిం జూచువేడుక నూరికి గమనోన్ముఖుండై తనపత్ని ననుపుమ
నిన నతం డనుపక తనయొద్దన పెట్టుకొనియుండ నక్కన్య యొక్క
నాఁడు.

137


సీ.

అలరంగ రమ్యవాతాయనంబునం జూచె
                బురుషమార్గంబునం బోవుచున్న
వాని సుస్నాతుని వరరూపసౌందర్య
                మందిరు విప్రకుమారు నొకని
గనుఁగొని కామించి దనమనం బతనిపై
                నిలిపి కామానలనిహితహృదయ
కమలయై యెంతయుఁ గలఁగి మతిఁ దన
                సఖి కేకతంబ యిష్టంబు సెప్పి
యితని బ్రత్యక్షముగను నేఁ డెల్లభంగిఁ
గవయకుండితినేని సుఖంబు గలదె
ప్రకటయౌవనసౌభాగ్యభంగమైన
తలఁపు నిలుపును గులమును దైవ మెఱుఁగు.

138