పుట:బేతాళపంచవింశతి.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నీచేసినయపకార్యము
నాచే మాతండ్రి వినఁడు నమ్ముము భీతిం
బాసి గృహాంతరమున సుఖి
వై చరించునది సుమ్ము యనురాగమునన్.

132


గీ.

అతిరహస్యమైన యట్టి తద్గృహమున
నతని నునిచి యభిమతార్థసమితిఁ
దెచ్చిపెట్టి వానిఁ దృప్తునిఁ జేయుచు
నొనర నతని బొందియుండె నంత.

133


వ.

ఎట్టకేనియుఁ గొన్నిదినంబు లుండి యతండు జూదంబునందుం
దద్దయు లోలుండు గావున నర్థంబు గావలసి యొక్కనాఁటిరాత్రి
భార్యం జంపి తొడవు లన్నియుం గొని యతిసాహసుండై యెట
యేనియుం బోయెఁ గావున.

134


క.

ఇటువంటి పాపచరితులఁ
గుటిలాత్ములఁ బొందఁదగదు క్రూరుల నెపుడున్
పటుబుద్ధులైనవారిని
గుటిలుల భామ లిటు పొందఁ గూడునె యెందున్.

135


క.

అనవుడు శారిక పలుకులు
విని రాజకుమారువరుఁడు విస్మితమతియై
తనచిలుకఁ జూచి నవ్వుచు
వినుతకళాభిజ్ఞ చెప్పవే నీ వనినన్.

136