పుట:బేతాళపంచవింశతి.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కంపితశరీరయై యి ట్లనియె.

127


మ.

అడవిన్ మ్రుచ్చు వచ్చి పట్టుకొని నీయల్లు బెడంగేలు గట్టి యి
క్కడ నీ విచ్చినసొమ్ము పుచ్చుకొని చక్కన్నంత గాలించి నా
తొడవు ల్గైకొని నూతం ద్రోసి యతనిం దోడ్కొంచు నక్కానలో
వెడలం బారి రటంచు నేడ్చుచును నిర్వేదించుచుం బల్కఁగన్.

128


గీ.

కూఁతు గారవించి గొనకొని క్రమ్మర
నీరు దుడిచి యమ్మ నీకుఁ దొడవు
లేమి బాతి యిదియె యిచ్చెద నీ పతి
నేమి చేసి రొక్కొ యెట్టులొక్కొ.

129


క.

అని తలంచుచుండ నయ్యం
గనయును సంతతము తనమగని రాకయు నె
మ్మనమునఁ గోరుచు నడలుచు
దినములు గడుపుచుఁ జరించె దీనాననయై.

130


వ.

మఱియుఁ గొండొకకాలంబునకు ధనదత్తుండు మామ యిచ్చిన
ధనంబును భార్య తొడవులును భక్షించి కృతఘ్నుండు గా
వున నిశ్శంకుండై మామయొద్దకుఁ బోయి తనభార్య మరణం
బెఱింగించి పునర్వివాహంబునకు ధనం బడిగెద నని తలంచి
చందనపురంబున కరిగి మామయింటికిం బోయి తనభార్యం
జూచి యులికిపడి భయభ్రాంతుండై వజ్రహతుండునుంబోలెఁ
బడిన నయ్యింతి యెఱింగి పరతెంచి యతనిచెవిం జేరి యి
ట్లనియె.

131