పుట:బేతాళపంచవింశతి.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వేపట్టి కట్టి త్రోచెను
గాపురుషుల కేల కల్గుఁ గరుణాదరముల్.

122


క.

ఇరువుర ని ట్లుగ్రుండై
పొరినూతం ద్రోచి శంకఁ బొందక యరిగన్
తెరువరు లంతట నంగన
పరివేదనరవము కనుచుఁ బారిరయమునన్.

123


వ.

భయభ్రాంతయై నలుదిక్కులం జూచుచు హాహారవంబు లెసంగ
నేడ్చుచున్న యన్నాతిం జూచి యోడకోడకుమని నుయ్యిఁ జొచ్చి
వెడలఁ దిగిచి రంత.

124


క.

తరలాక్షి బ్రదికె నాయుః
పరిశేషము కలిమిఁ జేసి బానిశభూతా
దరణమునఁ జొచ్చె జనులకు
మరణంబె విన్న ధర్మమార్గము లెందున్.

125


క.

తెరవరు లొయ్యనఁ దోడ్కొని
యరుగఁగఁ బురిజను లెఱింగి యాయంగన నా
దరమున నప్పుడ నిజమం
దిరమునకును దండ్రికడకుఁ దెచ్చిరి యంతన్.

126


వ.

తండ్రియు భయము భ్రమంబులు హృదయంబున గదుర నెదురువచ్చి
కూఁతుం దోడ్కొనిపోయి యుత్సంగంబుపైఁ బెట్టుకొని నీ వొక్కర్తెవు మగ
నిం బాసి యిట్టు వచ్చిన తెఱం గేమి యని యడిగిన నయ్యింతి భయ