పుట:బేతాళపంచవింశతి.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నందుఁ బెద్దకాలం బుండి నిజదేశంబునకుఁ బోయెదనని యొక్క
నాఁడు మామ కెఱింగించిన నతం డి ట్లనియె.

117


క.

అల్లుఁడవు కొడుకు వన్నను
దెల్లమి గా నీవె నాకు ధృతిఁ గూఁతును నా
యిల్లును సర్వము నిచ్చితిఁ
జెల్లంబో విడిచిపోవఁ జెల్లునె నీకున్.

118


గీ.

అనిన మామవల్కు విని యేఁ గృతఘ్నుండఁ
గాను నమ్ము మేడుగడయు నీవ
నేను దల్లికిఁ జూపి నీకూఁతు మ్రొక్కించి
మగుడఁ దోడి తెత్తు మసల కనిన.

119


క.

చల్లనిమాటల కెంతయు
నుల్లంబున నమ్మి మామయును జాలధనం
బల్లునకుఁ గూఁతునకు శో
భిల్లెడు తొడవులును నిచ్చి ప్రియ మొనరంగన్.

120


గీ.

దాసి నొకతె నిచ్చి తడయక యనిచినఁ
దోడుకొనుచు బోయి దుష్టబుద్ధి
యగుచుఁ బోయి యొక్కయడవిలోఁ దెరువున
నూయిగుంటఁ జేరఁ బోయి నిలిచి.

121


క.

వాపోవఁగఁ దొడవులుఁ గొని
పాపాత్ముఁడు గూఢలతల భార్యను దాసిన్