పుట:బేతాళపంచవింశతి.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డుచిలుకలం జూచి దరహసితవదనుం డగుచు స్త్రీపురుషుల
దోషంబు లేర్పడ విభాగించి చెప్పిన వినిన యటమీఁద న్యాయంబు
సెప్పెదమని రాజపుత్త్రునకుఁ గింశుకముకుళంబునుం బోని చంచు
పుటంబు శోభిల్లుచుండ శారిక మొదల ని ట్లనియె.

115


సీ.

ఆవంతియను పురి నర్థవంతుండను
                వైశ్యుండు బహుధనపరుఁడు గలఁడు
ధనవంతుఁ డనఁగ నాతనిపుత్త్రుఁ డభినవ
                యౌవనరూపుఁడై యమరుచుండు
నంతటఁ దండ్రికాలావసానమున భా
                ర్యయుఁ దాను సురలోక మరుగుటయును
నంత ధూర్తులఁ గూడి యతులితమైన యా
                ధన మెల్ల నిజకులధర్మ మెడలి
యనుదినంబును ద్యూతవేశ్యానురక్తి
నర్థమంతయు గోల్పోయి యతిదరిద్రుఁ
డైన వదలిరి ధూర్తసహాయు లెల్ల
నంత నొకరుఁడు వోయె దేశాంతరంబు.

116


వ.

దుశ్చారుండై నిరం[తరం]బును దిరు[గు]చు సంతాపనివృత్తంబైన చందన
పురంబు చేరి యందు హిరణ్యగుప్తుం డనువైశ్యుం డతని నెఱింగి తనకూఁతు
నిచ్చి యపుత్త్రకుండును నతిసమర్థుండును గావున నతనియొద్దన పెట్టుకొని
యున్న ధనవంతుండు భార్యాసమేతుండై సుఖింపుచు