పుట:బేతాళపంచవింశతి.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సుధాకరుండునుంబోలె నత్యంతకాంతికలితాననుండై.

109


క.

ఆ లలితాంగియుఁ దానును
లీలోద్యానంబులను లలితహర్మ్యములన్
గేళి యొనర్చుచు నుండఁగ
నాలంకృతమతి సమున్నతౌత్సుక్యమునన్.

110


వ.

అంత నొక్కనాఁడు.

111


గీ.

ఇద్ధబుద్ధులైన యిరువురచిలుకలు
రమణ నొక్కపంజరమున నుండి
రాజతనయుచిలుక రమణిశారికతోడ
ననుభవింపుచుందు మనిన నదియు.

112


క.

పురుషు లరయఁ గృతఘ్నులు
క్రూరులు నా నేల నాకు రుచి పుట్టదు నీ
తో రతి సేయఁగ ననవుడు
శారికపలుకులకుఁ జిలుక సైఁపక పలికెన్.

113


క.

వనితలు దోషంబుల పు
ట్టినయిండ్లును గాదె యీ కఠినభాషలు నె
ట్టన విరసంబుగఁ బలికితి
విన నేరం బయ్యె నవియు విపరీతములై.

114


వ.

అని తమలో వివాదంబు సేయుచుండఁ బంజరంబుకడకు వచ్చిన రాజ
పుత్త్రు నెదుర దాసిత్వపణంబుగాఁ జేసి పన్నిదంబు చరచిన నారెండు