పుట:బేతాళపంచవింశతి.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

బహుచితాభస్మనిర్మితంబై విచిత్రలాంఛనంబులు గలిగి యుద్దండమండలమధ్యంబున శవంబు నుత్తానంబుగా వెట్టి దక్షిణాభిముఖుండై భేతాళాహ్వానంబు చేసి రక్తకుసుమాల్యంబుల నర్ఘ్యాదివిధులం బూజచేసి విక్రమసేనుం జూచి నీకు మనోరథంబులు సఫలంబయ్యెడి. కృతార్థుండవై సాష్టాంగనమస్కారంబు సేయుమని పంచిన నన్నరేంద్రు డతని కిట్లనియె.


గీ.

వినవె యట్టిమ్రొక్కువిన నేను జూచి ము
న్నెరుగ నేను మీర లిట్టు లనుచు
మొదలు మ్రొక్కి చూపు పిదప నే మ్రొక్కెద
నని నీవైవ నిహతు డగుట జేసి.


క.

అక్కట భిక్షు డప్పుఁడు
మ్రొక్కుటయును నృపతి ఖడ్గమున వానిశిరం
బక్కీటు కలెత వ్రేసెను
తక్కొకభేతాళుపట్టు నలచినవాడై.


వ.

ఇట్లు దెంచి యాశిరంబు నుపహారం బిచ్చి వానివక్షంబు వ్రచ్చి హృదయపద్మంబు వ్రచ్చి విక్రమసేనుండు భేతాళుం జూచి దానినం బ్రసన్నుడై.


క.

విక్రమసేనుని నక్కడ
చక్రధరఖ్యాతిబోలె జగములలో బూ
జాక్రమ మరుదగునని ని
ర్వత్రంబుగ నపుడు కలితవరదుం డగుచున్.
వ.అయ్యవసరంబున బుష్పవృష్టి కురిసె. బ్రహ్మవిష్ణుప్రముఖనిఖిల