పుట:బేతాళపంచవింశతి.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

నిన్ను గనుంగొని భేతాళునకు నమస్కరింపు సాష్టాంగంబులును ధరిత్రి న్మోపి యని నియోగింపగలడు. నీ వపుఁడు మోసపోక యిట్లను. నాదుదు బుద్ధిం జేసి.


క.

నే మొక్క యెవ్వరికిని మును
సామంతులచేత మ్రొక్కు సతతము నొందున్
ధీమణి యష్టాంగములప్ర
ణామముచందంంబు మాత్ర నా కెరుగంగన్.


క.

అని వాని బంచి మ్రొక్కిం
చి నరేశ్వర ఖడ్గ మెత్తి శిషృడ దల దృం
చి నివేదింపుము భేతా
ళునికి బరిదోష మెసగ లోకప్రణుతా.


వ.

అట్లు విపరీతం బయ్యెనేని వాడు త్రైలోక్యవిభూషణుండైన నిన్నుం బశువు వధించి భూతతృప్తి జేసి విద్యాధరచక్రి గాగలవా రెల్లభంగిని నిట్లు సేయునని యెరుంగు మిది సకలమనోరథంబుల నీకు సిద్ధించునని చెప్పి భేతాళుండు తత్ప్రదేశంబున శక్తిభరంబులు విడిచిపోయిన నన్నరేంద్రుండు శవంబు మోచికొని కాంతిశీలునొద్దకుం జనుదెంచినంత రాత్రి చదుర్భాగశేషం బయ్యె నంత.

కథ 25

ఉ.

ఆనరనాథు జూచి యతిహర్షము గైకొని దుష్టభిక్షు డ
న్నా నిజశౌర్యధైర్యసుమహత్వములన్నియు బోలదేరు ధా
త్రీనరనాథు నంచును నుతించి మనోరథసిద్ధి యయ్యె నిం
కెన ధరిత్రియంతయును నేలితినంచు మదిం దలంచుచున్.