పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

201

సన్ను పలకరించి నాకోటూ, టోపీ అడిగి తీసుకొని హాలులో వున్న వంకీలు స్టాండుకి తగిలించాడు. నన్ను లోపలికి తీసుకువెడుతుంటే గబగబా తొందరగా రాజు వచ్చాడు. మేమిద్దరమూ కలిసి హాలులోకి వెళ్ళాం. యజమానురాలు యెంతో సంతోషం ముఖంలో వ్యక్త పరుస్తూ, యెవరితోనో మాట్లాడుతున్నావిడ మా దగ్గరకొచ్చి రాజును పలకరించి యోగక్షేమములు విచారించి నా కేసి చూపిస్తూ ఈజ్ దిస్ జంటిల్ మన్ యువర్ న్యూ ఫ్రండ్? అని అడిగింది. ఔనండని నా పేరు చెప్పి నన్ను పరిచయం చేశాడు. ఆవిడ నన్ను మందహాసముతో యెగాదిగా చూచి వేరి ప్లీజ్డ్ టు మీట్ యు మిష్టర్ పార్ ... బా ... టిసెం అని కరచాలనం చేస్తూ “హౌడుయుడూ” అంది. ఆ యింటి వైభవం, అక్కడి మనుష్యులను యజమానురాలి సౌందర్యాన్ని చాకచక్యాన్ని చూచి ముగ్ధుడనై పరధ్యానంగా గాజు చెప్పిందంతా మరచిపోయి హౌడూయుడూ అని అనగానే యేం చెప్పాలో తోచక “యాజ్ యూజువల్ లైక్ ఆల్ పీపుల్” అని యింకా