పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

బారిష్టరు పార్వతీశం

తారు. దానికి వాళ్ళు కొంత డబ్బు తీసుకుంటారు. యెంత తీసుకున్నా హోటలు భోజనముకంటే తక్కువ ఖర్చే అవుతుంది. మీరు బ్రాహ్మణులూ, వైదికులు ఆయెను. నేను తినే మాంసమూ, చేపా, వగైరా మీరు ముట్టుకోరుగా, యింటివారితోటి మీరు శాకాహారినని చెప్పి, బియ్యమూ, వుప్పూ వగైరా కావలసిన సామగ్రి చెబితే వాళ్ళే తీసుకు వస్తారు. అది యెలా వండాలో మీకు తెలిస్తే వాళ్ళకు చెప్పండి. లేకపోతే వాళ్లు చేసినట్లు తినవలసి వుంటుంది. పది రోజులు పోతే, అన్నీ మీకే అలవాటు అవుతాయి. అన్నాడు. “అబ్బో అదేమీ అక్కరలేదండి. నాకు ఇవన్నీ బాగా అలవాటే మా యింటి దగ్గర మా అమ్మబయట వున్నప్పుడు, మా నాన్న పొలము వెళ్ళినా, పొరుగూరు వెళ్ళినా నేనే చెయ్యి కాల్చుకోవలసివచ్చేది. చాలా బాగా చేశానని మా అమ్మ మెచ్చుకొనేదికూడాను. ఉండండి నేను ఎక్కడో ఒకచోట స్థిరపడ్డ తరువాతను నాచేతి భోజనము మీకు రుచి చూపిస్తాను. ఒక రోజున” అన్నాను. “చాలా సంతోషమండీ, అంతకంటేనా మళ్ళీ ఓమాటు మాయింటికి వెళ్ళి వచ్చినట్లు వుంటుంది కూడా” అన్నాడు నవ్వుతూ.

ఇంక అక్కడినుంచి లేచి నెమ్మదిగా గదికి చేరుకున్నాము. అక్కడ ఆయనకు మామూలు భోజనము. నాకుకొద్దిగా అన్నమూ, బంగాళాదుంపల కూరా, పాలూ ఇచ్చారు. కూరంటే ఊరకే దుంపలు ఉడకవేసి అది మెత్తగా కుమ్మి పెట్టారన్నమాట. నాకు కావలసిన వుప్పూ, పచ్చి కారమూ, దానిమీద చల్లుకోవాలని మా మిత్రుడు చెప్పాడు. “యీ ధర్మ సూక్ష్మము ఇదివరకే గ్రహించాను” అన్నాను.

భోజనము అయిన తరువాతను అక్కడ సోఫామీద రెండు తలగడలూ, రెండురగ్గులూ, రైలులోకిమల్లే ఇంటావిడ తీసుకువచ్చి పడ వేసింది. అతను మర్యాదగా “నేనీ పూటకు సోఫామీద పడుకుంటాను. మీరు నా మంచం మీద పడుకోండి” అన్నాడు. “అబ్బెబ్బే యెంతమాట. నేను సోఫామీద పడుకోగలను. నాకు బాగా అలవాటే” అన్నాను. నా జీవితంలో చాలాభాగం సోఫాల మీదనే పడుకోవడము అలవాటైనట్లు అతను మరి కొంచెము బలవంతము చేసినా నేను ఒప్పుకోలేదు. సోఫామీద కూడా యెంతో సుఖముగానే వుంది. మరి కొంచెము సేపు పిచ్చాపాటీ మాట్లాడుకుని నేను సోఫామీదా అతను మంచం మీదా ఒరిగాము. “ఎడిం బరో”లో మొదటి రాత్రి సుఖ స్వప్నాలు కంటూ గడిపాను. ఆ రాత్రి రాజింట్లో సుఖంగా నిద్రపట్టింది. యెన్నెన్నో చిత్ర