పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

బారిష్టరు పార్వతీశం

లేకపోతే చాలా యిబ్బంది పడతాడు. మనం ఒకళ్ళకొకళ్ళం చేదోడు వాదోడుగా ఉండకపోతే, ఇక్కడ యెలా బ్రతుకుతాం, ఏమంటావు - అన్నాడు మందహాసంతో

ఓ తప్పకుండా, అలాగే నేను చూస్తాలే. నువ్వు వెళ్ళు అన్నాడు రాజు. అతను లేచి “అబ్బాయీ మనం మళ్ళీ కలుసుకుందాము. ఈ రాజు మీ ప్రాంతమువాడే. చాలా మంచివాడు, మీకు కావలసిన సహాయం అతను చేస్తాడు. నాకు పని వుంది. నేను వెళ్ళుతున్నాను.” అని నాకరచాలనంచేసి వెళ్ళిపోయాడు. అతను ఖాళీ చేసిన కుర్చీలోకి రాజు వచ్చి కూర్చుని “ఏం బాబూ! మీదేవూరు, ఎక్కడ నుంచి వచ్చావు. ఎప్పుడు వచ్చావు. సంగతి సందర్భాలు అన్నీ చెప్పు నాయనా అంటూ, తనది భీమవరమనీ, అందుచేత తెలుగువాడిననీ, క్షత్రియుడననీ చెప్పుకొని, ఇంకచెప్పు నీ సంగతి” అన్నాడు. టూకీగా - ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా, అప్పటి వరకూ జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. “నీ సామానూ అదీ యెక్కడ ఉందన్నాడు.” “ స్టేషనులోనే పెట్టాను” అన్నాను “సరే అయితే లే. వెళుదాము. నీ సామాను తీసుకొని నాగదికి చేరుద్దాము నీకు గదిదొరకే వరకూ నా దగ్గర ఉందువుగాని నీకేమి ఇబ్బంది ఉండదు. సుఖంగానే ఉంటుంది లే” అన్నాడు. నేను బయలుదేరి "స్టేషనుకు వెళ్ళి సామాను తీసుకొని అక్కడ నౌకర్లకు మామూలు చెల్లించుకుని రాజు గదికి చేరుకున్నాను.

9

నేను కొంత సేపు సుఖంగా అక్కడ విశ్రయించాను. సాయంత్రము నాలుగ్గంటలకు నేనేమీ చెప్పకుండానే, ఇంటి ఆవిడ నాకు టీ రొట్టెవగైరా తీసుకువచ్చి బల్లమీద అమర్చింది. నేను అది ఆరగించి, ఆ గదిలో పుస్త కాలు తిరగ వేస్తూ, కాసేపు కూర్చునేసరికి రాజు కాలేజీ నుంచి వచ్చాడు. “ఏమండీ సావకాశంగా విశ్రాంతి తీసుకున్నారా? టీ తీసుకున్నారా?” అని అడిగాడు. “ఆహా అన్నీ అయినాయి. ప్రాణం యెంతో హాయిగా ఉన్న దిక్కడ” అన్నాను. రాజు పుస్తకాలక్కడపడేసి స్నానాల గదిలోకి వెళ్ళి ముఖప్రక్షాళణ చేసుకుని వచ్చేసరికి, యింటి ఆవిడ మళ్ళీ అతనికి, నాకూ టీ ఫలహారాలూ, తీసుకు వచ్చింది. “నాకేమీ వద్ద”న్నాను. అప్పుడు తను నాకు నేర్పిన ప్రధమ పాఠము ఏమిటంటే “ఇక్కడ ఏ వేళప్పుడు యెవరు