పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

181

ఇండియన్ అసోసియేషన్ అని బల్ల కట్టబడిన ఒక పెద్ద యింటిలోనికి తీసుకు వెళ్ళి, అక్కడ హాలులో నన్ను కూర్చోపెట్టి తనూ నా కెదురుగుండా కూర్చుని “ఇక చెప్పు నీ సంగతి” అన్నాడు ఇంగ్లీషులో.

అక్కడికి చాలా మంది మన దేశస్థులు లోపలికివచ్చే వాళ్ళూ. పోయే వాళ్ళూ కనపడ్డారు. నేను నా సంగతంతా చెప్పాను. అతను సావకాశముగా విన్నాడు. తను బెంగాలీ వాడినని చెప్పాడు. ఇంకా యేదో చెప్పబోతుంటే చూడగానే తెలుగువాడిలా కనబడే వ్యక్తి ఒకరు లోపలికి వచ్చాడు. నా యెదుటనున్న బెంగాలీ అతను “హలో రాజూ, కమ్ హియర్” అనిపిలిచాడు. అతను వచ్చి నిలబడ్డాడు. కూర్చో ఇతను మీవాడు. మీ ప్రాంతము నుంచి వచ్చాడు. గదికోసం తిరుగుతున్నాడట. నువ్వు అతనికి ఏదయినా గది చూపించి యెక్కడో ఒకచోట ప్రవేశపెట్టు పాపం.