పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

బారిష్టరు పార్వతీశం

కుట్టి అట్టే పెడతారు. అవి వచ్చిన వాళ్ళకి ఎవరికి సరిపోయినది వారికి ఇస్తారు.

సాధారణముగా యిన్ని అడుగుల పొడవు ఉన్న మనిషికి చేతులు యింత పొడవుంటాయి, చాతీ యింత వెడల్పు ఉంటుంది. మెడ యింత పొడవుంటాయి, చాతీ యింత వెడల్పు ఉంటుంది. మెడ యింత, నడుము యింత, కాళ్లు పొడుగు యింత, అనే లెక్క ఉంటుంది. ఆ ప్రకారం కుట్టి పెడతారు. ఎక్కడో నూటికి తప్ప సాధారణంగా ఏరకం మనుషులకీ ఆ రకం సరిపోతూనే ఉంటాయి. అని చెప్పి నా సందేహము తీర్చాడు.

“నువ్వు లోపల తొడు కునే బనీను లాంటిది ఉదయాన కొన్నవి తొడుక్కున్నావా!?” అన్నాడు.

“లేదు” అన్నాను “మరి కొన్నదిఎందుకయ్యా, తొడుక్కోవడానికా, పెట్లో పెట్టుకోవడానికా? రాత్రి ప్రయాణము కూడాను. చలి ఎక్కువగా ఉంటుంది. ముందు అవి తొడుక్కో” అన్నాడు, పై బనీను ఒక్కటే సరిపోతుందా? లేకపోతే షరాయిలాంటిది కూడా తొడుక్కోవాలా! అన్నాను. “రెండూ తొడుక్కోవాలి” అన్నాడు

“చచ్చేచురా!” అని కట్టినవన్నీ మళ్ళీ విప్పి, అందులోవి తొడుక్కోవడానిని ప్రయత్నం చేశాను. ఓపట్టాన ఎక్కలేదు. కానీ మేజోడు లాగానే