పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

173

అటుంచి, ఆ సూటు అయిదు నిమిషాలలో వాడెలా కుట్టి యిచ్చాడో నాకు అర్థముకాలేదు, లేక అక్కడ వున్న వాటిల్లో మరెవళ్లకో కుట్టింది, నాకు సరిపోతే నాకు తొందరగా ఉన్నదిగదా అని అవతలి వాళ్ళకి మరొకటి కుట్టి యివ్వవచ్చు గదా అనే ధీమాతో నాకు ఇచ్చాడా! అనే సందేహముకూడా కలిగింది సరే వాడెలాయేడుస్తే నా కెందుకనీ, నాపని నాకు జరిగిందిగదా అని సంతోషించి, అవన్నీ మడిచి, జాగ్రత్తగా మళ్ళీ ఆ పెట్టెలో పెట్టి భద్రపరుచుకున్నాను, కొంచెం సేపు విశ్రమించి, ఒంటిగంటకు లేచి, మధ్యాహ్న భోజనానికి తయారయ్యాను. ఆవేళప్పుడు, భోజనాల హాలులోను తప్ప మరెవ్వరూ కనబడలేదు.

7

ఇక్కడ వాళ్లంతా, వాళ్ళ వాళ్ళ పనుల మీద వెళ్ళి ఏ హోటల్లోనో తింటారు కాబోలు అనుకున్నాను. అక్కడ మనిషి వెంటనే నాకు ఫలహారములు అమర్చాడు. నేను ఫలహారము ముగించి నాగదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఆ పడక పడక నాలుగు గంటలకుగాని, మెలకువ రాలేదు. ఇంత వెర్రి నిద్రపట్టినదేమో అనుకున్నాను. లేచి ముఖం కడుక్కుని కాసేపు అటూ, ఇటూ తిరిగి వద్దామని వీధిలోకి వచ్చాను. ఎక్కడికేనా వెడితే దారి తప్పిపోతాననే భయముతో ఆ వీధిలోనే ఉన్న షాపులనూ, దారే పోయే జనాన్ని, హడావిడిగా పరుగులెత్తే వివిధ వాహనాలనూ, చూస్తుంటే ఇట్టే నాకు తెలియకుండానే ఆరు గంటలయిపోయింది. నేను వెంటనే బసకు చేరుకున్నాను. ఇంతలో మీనన్ రానే వచ్చాడు.

“సవరణ అంతా అయిందా? ఈ పూట ప్రయాణమే కదా!” అన్నాడు.

“నా ఆలస్యమేమీ లేదు. ఈపూట ప్రయాణమే” అన్నాను.

“ అయితే భోజనం చేద్దాం రమ్మన్నాడు. పావుగంటలో భోజనము ముగించుకుని, నాగదిలోకి వచ్చాము.

“సామానులన్నీ జాగ్రత్తగా సర్దుకున్నావా!” అన్నాడు మీనన్ , “అన్నీ సర్దుకున్నాను” అన్నాను “బట్టలు బాగున్నాయా” అన్నాడు, “నువ్వు కొనడం, అవి బాగుండక పోవడమూనా?” అన్నాను. కాని నా కొక్క సంగతి చెప్పుబాబూ! వాడు సూటు అంత త్వరగా ఎలా కుట్టాడో తెలియక చస్తున్నాను అన్నాను. అతను పకపక నవ్వి వాళ్ళు కొన్ని ఎప్పుడో