పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

169

రెండు టిక్కట్లు తీసుకువచ్చాడు.

“ఇప్పుడే టిక్కట్లేమిటీ!”

అని అడిగేలోపునే, నన్ను రెక్కపట్టుకుని మరో గేటులోనుండి లోపలకు లాక్కుని వెళ్ళాడు. మేము లోపల అడుగు పెట్టడమూ ఆ గేటు దభీమని మూసుకోవడమూ, ఠపీమనీ మేము పాతాళములోనికి దిగిపోవడమూ అన్నీ “కూ” అనే లోపున అయిపోయినాయి. నేను కెవ్వుమందామని అనుకుని అనేలోపలే మళ్ళీ తెరిచిన చప్పుడు కావడము, మీనన్ నన్ను రెక్కపట్టుకుని వెలుపలకు తీసుకెళ్ళడమూ “ఏమిటది?” అనే లోపుననే రైలు రావడమూ, మేము అందులో కూర్చోవడమూ జరిగిపోయాయి. అప్పుడు మీనన్ నా వీపు తట్టి, ఏమీ భయములేదులే. యిందాక చాలా కంగారుపడ్డావు కదూ! అక్కడ మాట్లాడటానికి దేనికీ వ్యవధిలేకపోయింది. ఇందాక మనము టిక్కట్టు తీసుకుని గేటులో నుంచి వచ్చామే అది “లిఫ్ట్” అన్నమాట. అంటే. అందులో నుంచుని, తలుపు మూసేసి ఒకమరనొక్కుతే, అది మనుష్యుల్ని కిందకుగా, పైకి గానీ తీసుకు వెళుతూ వుంటుంది. ఈ వూళ్ళో ఈ రెండు రోజులనుంచీ చూస్తున్నావు కదూ? వీధులెంత సమ్మర్థంగా వుంటాయో! అందుకని ఆ సమ్మర్థం తగ్గించడానికి, ప్రజలు ఒక చోటనుంచి, ఒకచోటుకు వెళ్ళడానికి, త్వరగా తిరిగిరావడానికి వీలుగా ఉండేట్టు భూమికీ కొంత లోతున ఈ రైలు ఏర్పాటు చేశారు. అతని వాక్యం పూర్తి అయ్యే సరికి రైలు ఆగడమూ, నన్ను మళ్ళీ మాట్లాడకుండా మీనన్ చెయ్యి పట్టుకుని, రైలులోనుంచి బయటకి అక్కడ నుంచి లిప్టులోనూ, తీసుకువెళ్ళడం, లిఫ్టు యీ మాటు పైకి వెళ్ళడం, మేము మళ్ళీ అందులోనుంచి బయటపడడం, అన్ని , ఓదేముడా! అవడానికి కూడా వ్యవధి లేకుండా జరిగిపోయింది. ఇంకను మళ్ళీ మీనన్ ఏమీ మాట్లాడకుండా ముందుకు తీసుకు వెళ్ళాడు. మనస్సులో యెన్నో ఆలోచనలూ, సందేహాలూ, బయలు దేరినాయి. మొదటి పాతాళంలో పడినప్పుడు, గుండె ఆగిపోయిందనే అనుకున్నాను. మళ్ళీ లిఫ్టులో నుంచి పైకి వచ్చేటప్పుడు కూడా గుండె పట్టేసినట్టయింది. అలాంటప్పుడు యీ ఏర్పాట్లవల్ల పిన్నలకీ పెద్దలకీ కూడా ప్రాణాపాయము కదా! అనుకున్నాను. అలా అయితే యీ యేర్పాట్లు యెందుకు జరిగాయి? అనుకున్నాను, అప్పుడు మార్సెల్స్ లో గానీ, ఈనాడు ఇక్కడగాని, కావడం యెవరూ “హరీ అనలేదు. అంతా నిరపాయముగానే బయటపడ్డారు. తరువాతను భూమి అడుగున ఇంత