పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

163

తెలియకుండా పంజరానికి దగ్గరగా జరిగింది. ఆ కోతి రెప్పపాటులో ఈవిడ నెత్తిమీద టోపీ అందుకుని లాగింది. మొర్రో మంది ఈవిడ. అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఆ టోపీతో పాటు ఆవిడ నెత్తి మీద నున్న కృత్రిమ కేశాలంకరణము కూడా వూడివచ్చింది! ఆవిడకు ఆపుకోలేని దుఃఖము వచ్చింది. ఒళ్ళుమండి తన చేతిలో వున్న కర్రతో ఆ కోతిని కొట్టబోయింది. కోతి నవ్వుతూ, లోపలికి తప్పుకుంది.

యెటొచ్చీ కటకటాలలో నుంచి, ఈటోపీ లాగలేక అక్కడే విడిచిపెట్టింది. ఈవిడ దీన్ని తీసుకుని ఇంతమందిలోనూ ఇది నెత్తిమీద యెలో పెట్టుకోవడమా అని ఆలోచిస్తుండగా అక్కడకొక నౌకరు పరుగెత్తుకు వచ్చి కోతిని కోప్పడి ఈమెను పరామర్శించి ఆమె చెయ్యి పట్టుకుని