పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

బారిష్టరు పార్వతీశం

కళ్ళూ నామీద పడ్డాయి. అది గ్రహించుకుని, నేనిప్పుడే వస్తానండీ అని గబగబా నా గదిలోకి పరుగెత్తి, నేనూ ఆ కోటు తొడుక్కుని వచ్చాను. వెంటనే బయలుదేరాను.

వీధిలోకి వచ్చేసరికి పది పదిహేనుమంది కూర్చోడానికి సరిపడే కారు ఒకటి సిద్ధంగా వున్నది. మేమందులో కూర్చోగానే బయలుదేరి, ఊరంతా తిప్పి తిన్నగా ప్రదర్శన శాలకు తీసుకు వెళ్ళింది. మేమంతా అక్కడ దిగి, లోపలకు వెళ్ళాము. లోపల ప్రవేశించడానికి టిక్కెట్లు కూడా కొనుక్కోవాలి. మా అందరి బదులు మానేజరు అమ్మగారే టిక్కెట్లు కొన్నారు. లోపలకు వెళ్ళుదునుగదా, అదేదో మన పెద్ద పశువుల శాలలా వుంటున్నద నుకున్నది, అలాకాకుండా, యేదో కొన్ని వందల యకరాలు వ్యాపించినట్టు కనిపించింది, అందులో కొంతభాగము కటకటాలు కట్టిన ఇళ్ళలాంటి వాట్లలో కొన్ని జంతువులు - జంతువలంటే నేను ఆవులూ, గేదలూ, యెడ్లు, పోతులూ, మేకలూ, గొర్రెలూ, గాడిదలూ, గుర్రాలూ, యింకో కావలిస్తే యేనుగులు, లొట్టిపిట్టలు తప్ప మరేమీ వుంటాయనుకున్నాను.