పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

151

ఎక్కడికో పోయింది. వర్తమానం దాటి వెనకటి కెక్కడికో ఏ కాలంలోనో “ఇవన్నీ నేనిదివరకూ చూచాననే, నేనిక్కడచాలాసార్లు తిరిగాననే భావం కలిగింది. ఇలాగనే ఫ్రాన్సులో కూడా ఒక్కసారి ఆ వూహవచ్చింది. మా మిత్రుడు చెబుతున్న దేదీ వినపడడంలేదు. నా స్మృతి గతములోకి ఎక్కడకో పోయింది.

నేను నిజంగా ఎప్పుడేనా పూర్వజన్మలో ఇక్కడకు వచ్చానా? అనిపించిందికూడాను. నా స్నేహితుడు తను చెప్పేది నేను వినడంలేదని తెలుసుకుని కాబోలు నా భుజంమీద చెయ్యివేసి, “ఏమండీ నిద్రపోతున్నారా! ఏమైనా కలలు కంటున్నారా?” అన్నాడు నవ్వుతూ “కలలేనండీ మేలుకొని వుండగానే నా వూహ దేశమూ, కాలమూ, దాటి ఎక్కడికో తీసుకుపోతున్నది. నేనిదివరకు వీటినన్నటినీ చూచిన భావన కలుగుతోంది. చాలా చిత్రముగా వుంది” అన్నాను. నా మిత్రుడు ఒక్కసారి నామొఖం