పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

145

ఆకలి రుచి ఎరగదన్నట్లు, మాట్లాడకుండా రెండు ముద్దల్లో, అదంతా ఊదేశాను.

తరువాత పుడ్డింగుట సగ్గుబియ్యం పరవాన్నం - గట్టిగా ముద్దలా వున్నది తీసుకు వచ్చి, దానిలో పోసుకోడానికి వేడిపాలూ, కొంత పంచ దార కూడా తీసుకవచ్చి అక్కడ పెట్టాడు, అదీ తీసుకుని లేచాను, నా గదికి తీసుకు వెడతానన్నాడా నౌకరు. రేప్పొద్దున మిమ్మల్ని కలుసు కుంటాను. మీకేమైనా సలహా కావలిస్తే చెపుతాను. అన్నాడు మా నూతన పరిచయస్థుడు, తన పేరు మీనన్ అని చెప్పాడు. “గుడ్ నైట్” అని చక్కాపోయాడు.

నౌకరు నన్నొక చిన్న గదిలో ప్రవేశ పెట్టి, నాకు కావలసిన సదు