పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

బారిష్టరు పార్వతీశం

బయటకు రావడంతోనే, నాలుగు వైపులా ఆశ్చర్యంతో చూశాను. నేను మద్రాసులాంటి స్టేషన్లు చాలా చూచానుగాని, ఇంత పెద్ద స్టేషను నాకెక్కడా కనబడలేదు. ఇది కొన్ని మైళ్ళు పొడుగుంటుందా అనిపిం చింది. అధమం ఒక మైలేనా వెడల్పు ఉండాలనుకున్నాను. ఇందాక రైలు, స్టేషనుకు కాక ఇంట్లోకి వెడుతోంది అని అనిపించడానికి కారణం, ఇప్పుడు తెలిసింది. ఇంత వెడల్పూ, పొడుగూ ఉన్న స్టేషను అంతటికీ గాజుకప్పు, పైభాగాన కనిపించింది. ఇంత గాజు ఎలా దొరికిందా వీళ్ళకు అనుకున్నాను. అసలు గాజెందుకు వేశారు. అనే సందేహం కూడా కలిగింది. ఒకవేళ ఏ కొబ్బరికాయేనా దానిమీద పడితేనో, లేక, పక్క ఇంటి కుర్రాళ్లె వళ్ళయినా, ఆటల్లో వాళ్ళ లక్కపిడతలో, పెంకు ముక్కలో, దానిమీద విసురుతేనో, ఇంత స్టేషనూ ఏమవుతుందనిపించింది. అయినా దానికి సమాధానం ఏదో మనమే వూహించి తెలుసుకోవాలిగాని, ఇలాటి మోటుమనుషులను అడుగుతే వాళ్లు అతి తెలివిగా మాట్లాడామనుకొని, నన్ను అవహేళన చేస్తారు. ఎందుకొచ్చినదీ బాధ, ఇంతకూ స్టేషను కప్పు ఎలా పోతే నా కెందుకు అని అప్పటికి సమాధానం చెప్పుకున్నాను.

ఇంతలో నా ప్రక్కనున్న కుక్ - అనగా వంటమనిషి కాదు - కుక్ కంపెనీ మనిషి బయటకు వెళదాం రండని చెయ్యి పట్టుకుని ముందుకి తీసుకు వెళ్ళాడు. పది బారలు నడవగానే, ప్లాట్ ఫారంలో మధ్యభాగం కొంత దానంతటదే పరుగెడుతోంది, దానిమీద కొందరు మనుష్యులు నిలబడి ఉన్నారు. దాని దారిన అది, దానితోపాటు దానిమీద మనుష్యులూ, ముందుకు సాగిపోతున్నారు. ఇది లోపలినించి ఎక్కడనుంచి వస్తోందో, దానికీ అంతు ఉందో, లేదో, తెలియదు. నేను ఈ ఆలోచనలో వుండగా నా పక్కనున్నతను నా చెయ్యి పట్టుకుని, తనతోపోటు నన్ను కూడా దాని మీదకు లాగాడు. అతను మేకులా, అలాగే నిలబడ్డాడుగాని, నేను మటుకు వెనక్కుపడబోయాను. అతను నావీపు వెనక చెయ్యి ఆసరాయిచ్చి నేను పడిపోకుండా ఆపు చేశాడు. మేము నిలబడ్డది కదిలే ప్లాట్ ఫారం. అది ముందుకు సాగుతూనే వుంది. అది చాలా చిత్రంగా కనపడ్డది. ఇలా కొంతదూరం వెళ్ళిన తరువాత ఎదట మేడ మేట్లులాకనపడ్డాయి. దానిమీ దకు కూడా, ఇది పరుగెడుతూనే వుంది. జనం పడకుండా అలా నిలబడే వున్నారు. వాళ్ళు పడకుండా ఎలా ఆగారా అని ఆలోచిస్తోంటే, మేము నిలుచున్న భాగం కూడా, "మొదటి మెట్టు ఎక్కడం. నేను వెనక్కుప డిపోబోవడం, మళ్ళీ ఆయన ఆసరాతో నిలబడ్డం. మేడ మెట్లు ఎక్కినట్లు నన్ను కూడా ఎక్కమని తనెక్కుతూ చెప్పడం, తగుదునమ్మా అని నేనా