పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

139

రైలు ఆగి ఆగడంతో బిల బిల లాడుతూ, రైలులో యావన్మందీ కన్నాల్లోంచి ఎలుకల్లా హడావిడిగా బైటకు వెళ్ళటం ప్రారంభించారు. నేనూ, నాతోవున్న ఆసామీ దిగడానికి లేచాము. నేనొకసారి నా సామాను కేసి చూశాను. అది అతను కని పెట్టి “దాని సంగతి నేను చూస్తాను దిగ మన్నాడు. మేమిద్దరం దిగడంతోనే, అతని సంజ్ఞకు, ఒక మనిషి లోపలికి వెళ్ళి, సామాను బయటకు తీసుకువచ్చాడు. అతన్ని చూస్తే మామూలు దొరలాగే వున్నాడుగాని, కూలీలనుకోలేదు. మనవూళ్ళల్లో అయితే, కూలీ ఇట్టే దొరికిపోతాడు. వాణ్ణి చచ్చినా “ఏమండీ” అని మనం అనలేము. అసలేందుకనాలి?