పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

బారిష్టరు పార్వతీశం

నేనింకా చిన్న కూచమ్మ ననుకుంటున్నావా ఏమిటి” అనే వాడిని, కొంచెం కోపం అభినయిస్తూ. ఇదంతా జ్ఞాపకము వచ్చి, ఒక్క మాటు దుఃఖం వచ్చింది. కళ్ళు వొత్తుకుంటూ చలికి గజగజ లాడుతూ పక్క చుట్టలో శాలువా తీసుకుని కప్పుకుందామా అని ఆలోచిస్తుండగా పాతాళంలోనుంచి ఎవరో తన్నుతే పై కుబికినట్లు, కుక్ కంపెనీ వారి అసామీ పాతాళంలో నుంచి వచ్చినట్లు తోచినా, నా పాలిటికి దివి నుండి దిగి వచ్చిన దేవతలా ప్రత్యక్షమయ్యాడు. నన్ను ఒక్కసారి ఎగాదిగా చూచి, Ha Ha! Ah! Good evening. What is your name? Ah! Let me see you are the Great Mr. Parvatesam aren't you? Fine we were hearing a lot about you good fine day. Bit chilly what?” (ఆహాఁ నమస్కా రము తమ పేరు - ఆఁ - అన్నట్టు మీరే కాదూ ఆ మహానుభావులు పార్వతీశంగారు. తమ సంగతి అబ్బో బోలెడంత విన్నాము. ఆఁ బాగుంది కొంచెము - శీతలం తిరిగింది కాదూ) అంటూ చిరునవ్వుతో నన్ను పలకరించే సరికి నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. కాని నన్ను “Great Parvatesam” అన్నాడు.