పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

52

బసవపురాణము

చేదిదేశము (జబల్పూర్) నేలిన కలచుర్య (కలంజర) రాజులశాఖలలో నొకశాఖవారు కళ్యాణము నేలుచున్న చాళుక్యులయొద్దనుద్యోగులుగా నుండిరి. అందు బిజ్జలుఁడు మూఁడవ తైలపదేవునియొద్ద నుద్యోగిగా నుండి క్రమముగా స్వతంత్రుఁడై పశ్చిమ చాళుక్యరాజ్యమున కేకచ్ఛత్రాధిపతి యయ్యెను. ఆతని కిర్వురు భార్యలు, పెద్దభార్యకు నలుగురు పుత్రులు, పిన్నభార్యకొక పుత్రుఁడు నొక పుత్రికయు జనించిరి. బిజ్జలుడార్జించిన పశ్చిమచాళుక్యరాజ్యము తత్పుత్త్రులకాలమున యథాయథలయినది. సరియయిన వంశానుక్రమణి తెలియరాదు గాని, పల్నాటిలో రాజ్యమేలిన వారును, పల్నాటివీర చరిత్ర కథానాయకులునగు ననుగురాజ ప్రభృతులును, విద్యానగరరాజబంధువులై 15 శతాబ్ది నుండి యాంధ్రదేశమునఁ బ్రఖ్యాతిగడించిన వారగు నార్వీటి బుక్కరాయాదులును నీ బిజ్జలుని వంగడమువారగుదురు. బిజ్జలుని వంశవృక్ష మిట్టిది :