పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

39


అని యడిగెను. 'త్రిపురాంతకుని గుడికిఁ దూర్పున (ఇది కళ్యాణ కటకమునఁ గలదే.) గపిలేశ్వరమున నొకతపస్వి యనుదినము నాఱుపుట్లపాలతో శివు నభిషేకించుచున్నాఁడు. ఆ పాలు వీథివీథులను గాలువలుగట్టి పాఱుచున్నవి. చల్లమ్ము గొల్లది యొకర్తె నెత్తిపైఁ గడువఁబెట్టుకొని యటపోవుచుఁ గాలుజారి పడఁబోవుచు "బసవయ్యా” అని పిలిచెను. ఆమెకుఁ దోడ్పడితిని. ఆ గొల్లదాని రూపిట్టిది; దాని యిల్లిట్టిది; విచారించి కనుఁగొనుము' అనెను. రాజు విచారింపగా నదియట్లే జరగినట్టు తెలిసెను. అబ్బురమంది రాజు బసవన నారాధించెను.

సొన్నలికపురమున శ్రీశైల మల్లికార్జునిని వెలయించి లక్షతొంబదివేల శివలింగములఁ బ్రతిష్ఠించి మర్త్యములోని యన్నపానముల ముట్టక, సహజమకుటము, నొసలికన్ను గలిగి, మేనినీడ, అడుగుజాడ, గానరాకుండఁ గైలాసముదాఁకఁ జరించువానిని సిద్దరామయ్య యను మహనీయుని నడిగి యొకప్పుడు శివభక్తులు కొందఱు బసవన యిహముననేకాక శివలోకమునను గూడఁ గానవచ్చుట నెఱిఁగిరి.

మిండజంగముల మిండఱికపు ముచ్చట్లకుఁగాను బొక్కసమునఁగల ధనమెల్ల బసవన వెచ్చపెట్టుచుండఁగా నుద్యోగులు బిజ్జలున కెఱిఁగించిరి. బిజ్జలుఁడు బసవనిఁ బిలిచి 'యట్లుచేయుట పాడియా' యని యడిగెను. 'ఒడయల సొమ్మే యొడయల కిచ్చితిఁ గాని మీధనముగా'దని బసవన యనెను. లెక్కలు చూపెను. బొక్కసపుఁదాళములు దెఱచి చూచుకొమ్మనెను. చూడఁగా లెక్కకు మిక్కిలియై బొక్కసమున ధనముండెను. బిజ్జలుఁడు నివ్వెఱ చెందెను.

బసవనభార్య గంగాంబ కట్టుకొనిన చీరఁ దెచ్చియిచ్చినఁ గాని చేరనియ్య నని వేశ్య యొకమిండజంగమున కానవెట్టఁగా నాతఁడు వచ్చి యడిగినంతనే బసవన తన భార్యచేత నా చీర నిప్పించెను. ఇట్లు పలువురు మిండజంగములకు వాంఛితార్థము లొడఁగూర్చెను.

జాతిభేదముఁ బాటింపక బసవన భక్తులయినచో మాలమాదిఁగలనుగూడ నారాధించుచుండెను. వారు కుడిచి డించిన యుచ్ఛిష్టమును భుజించుచుండెను. వారితోఁ జెయిచెయిఁగలపి తిరుగుచుండెను. ఇది సయిపఁజాలక