పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

బసవపురాణము


రాజపురోహితులు రాజుతో విన్నవించిరి. 'కళ్యాణకటకమెల్ల బసవని మూలమునఁ జెడుచున్నది. వర్ణాశ్రమధర్మము లిఁక నిలుచునట్లులేవు. ఆతఁడు మాలమాదిఁగలతో భుజించుచున్నాఁడు; మరల నీ నగరిలోనికి మర్యాదగా వచ్చుచున్నాఁడు. శివనాగుమయ్య యనుమాలనితో నిప్పుడు దిరుగుచున్నాఁడు చూడు'మని యాతనికిఁజూపిరి. రాజు కోపించెను. బసవన వాదించెను. వీరమాహేశ్వరులకు జాతిభేదము పరికింపరాదనెను. బ్రాహ్మణులకంటె, భక్తులే యధికులనెను. శివనాగుమయ్య హస్తమునుబట్టి యొత్తి దాననుండి పాలు చిమ్మిరేఁగుటను బిజ్జలాదులకుఁ జూపెను. బ్రాహ్మణు లోడిపోయిరి. బసవనివాదమునకు లోఁగి బిజ్జలుఁడు శివనాగుమయ్యకు మ్రొక్కెను. ఏనుఁగు నెక్కించి యూరేఁగించి బసవయ్య శివనాగుమయ్యను దనయింటికిఁ గొంపోయెను.

కళ్యాణపురమున నప్పు డీపేళ్ళవారు భక్తులుండిరి

(బసవ. పు. 226 చూడు.)

(రుద్రునిమాఱట రూపంబు లనఁగ - భద్రేభసంహరు ప్రతినిధులనఁగ
కళ్యాణమున నిత్యకల్యాణభక్తి - లౌల్యనిరర్గళ లాలిత్యముగను
మడివాలుమాచయ్య మాదిరాజయ్య - బడవరబ్రహ్మయ్య బాచిరాజయ్య
కిన్నర బ్రహ్మయ్య గేశిరాజయ్య - కన్నడ బ్రహ్మయ్య గల్లిదేవయ్య
మోళిగమారయ్య ముసిఁడిచౌడయ్య - శూలదబ్రహ్మయ్య సుఱియచౌడయ్య
కలికేతబ్రహ్మయ్య గక్కయ్యగారు - తెలుఁగేసు మసనయ్య దెలుఁగు జొమ్మయ్య
శాంతదేవుండును జమ్మయ్య బాస - వంతు కేసయ్య యేకాంతరామయ్య
యుత్తమాంగద కేశిహొన్నయ్య గండ - గత్తెరనాచయ్య గాలాగ్ని రుద్రి
శృంగిబొప్పయగారు [1]సిగురుచందయ్య- డింగరిమల్లయ్య సంగమేశ్వరుఁడు
కదిరెరెమ్మయ మహాకాళయ్యగారు - పదుమరసును బురాణదమాయిభట్టు
నుదరదరామయ్య యోగిదేవయ్య - యుదయమరసుగారు హొన్నయ్యగారు
ధవళయ్యగారు బొంతాదేవిగారు - సవరద[2] చిక్కయ్య సారెనాయండు

  1. శివకుమారుండు
  2. చక్కయ్యగారు