పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

బసవపురాణము

బసవోదాహరణము - ఇది యముద్రితము. [1]

ఆది:

ఉ. శ్రీగురులింగతత్పరుఁ డశేషజగన్నిధి శుద్దతత్త్వసం
     యోగసుఖప్రపూర్తి వృషభోత్తమమూర్తి యుదాత్తకీర్తి ది
     వ్యాగమమార్గవర్తి బసవయ్య కృపాంబుధి మాకు భక్తిసం
     భోగములం బ్రసాదసుఖభోగములం గరుణించుఁగావుతన్.

కళిక : వెండియుఁ ద్రిభువనవినుతిసమేతుఁడు
        మండితసద్గుణమహిమోపేతుఁడు
        సురుచిరశివసమసుఖసంధానుఁడు
        పరమపరాపరభరితజ్ఞానుఁడు
        విదితానందాన్వీతమనస్కుడు
        సదమలవిపులవిశాలయశస్కుఁడు.

అంతము:

ఉ. నీవు దయాపయోనిధివి నిన్ను నుతించినఁ గల్గు భక్తి నీ
     చే వరవీరశైవరతి చేకుఱు నీకయి యిత్తుఁ గబ్బముల్
     నీవలనం గృతార్ధత జనించును నీకు నమస్కరింతు నా
     భావమునందు నుండి ననుఁ బాయకుమీ బసవయ్య, వేఁడెదన్.

ఇఁక సంస్కృత గ్రంథములు : -

సోమనాథభాష్యము -దీనికే 'బసవరాజీయ' మని నామాంతరము. ఇది యిర్వదియైదు ప్రకరణములు గలది. శైవసంప్రదాయము లిందు వివరింపఁబడినవి. ఇందు గాయత్రీమంత్రము శివపరమని నిరూపింపబడినది. లింగార్చనా

  1. సూచన: ఇది తరువాతికాలంలో వే. ప్ర. శా.గారిచే పరిష్కరింపబడి ముద్రించబడినది. ప్రథమముద్రణ చూ|| భారతి, ప్రభవ సంవత్సర మాఘమాసం. మరియు చూ| ప్రస్తుత బసవపురాణము అనుబంధం-2 (2013)